
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
● రెండు బైక్‌లు స్వాధీనం
నాగార్జునసాగర్: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగను సాగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాగర్ ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్‌లోని రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద గురువారం ఉదయం ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా.. బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా.. అతడిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి చందంపేట మండలం జగ్నతండాకు చెందిన రమావత్ రాముగా పోలీసులు గుర్తించారు. అతడి విచారించగా.. గత నెల 3వ తేదీన విజయపురి టౌన్ పైలాన్ కాలనీలో పల్సర్ బైక్ చోరీ చేశానని, ఆ బైక్‌ను మాచర్లలో విక్రయించడానికి వెళ్తున్నట్లు నిజం ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మాచర్ల పట్టణంలో మరో బైక్‌ను అపహరించి జగ్నతండాలోని తన ఇంట్లో దాచినట్లు చెప్పాడు. పోలీసులు అతడితో పాటు జగ్నాతండాకు వెళ్లి ఆ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి అతడికి 14 రోజుల జ్యూడీషియల్ రింమాండ్ విధించినట్లు ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు.