
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
నడిగూడెం: కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు నడిగూడెం మండలం చాకిరాల వద్ద బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం నుంచి అనంతగిరి మండలం శాంతినగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రతిరోజు ఆకుపాముల మీదుగా నడిగూడెం మండలం తెల్లబల్లి, ఎకలాస్‌ఖాన్‌పేట, రామాపురం, చాకిరాల గ్రామాలకు చెందిన విద్యార్థులను కరివిరాల మోడల్ స్కూల్‌కు తీసుకెళ్తుంది. చాకిరాల వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టిన వంతెనపై సంబంధిత కాంట్రాక్టర్ సరిగ్గా మట్టి పూడ్చకపోవడంతో బస్సు రహదారి దిగి వెళ్తుండగా.. వంతెన వద్ద దిగబడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫ రోడ్డు పక్కన దిగబడిన బస్సు