
సిబ్బంది కొరతతో ఇబ్బంది
ఆలేరు మున్సిపాలిటీలో 12వార్డులు..20 వేల జనాభా ఉంది. మొత్తం పారిశుద్ధ్య సిబ్బంది 44మంది ఉండగా ఇందులో ఇద్దరు రెగ్యులర్ సిబ్బంది కాగా ఆరుగురు డ్రైవర్లు, మిగతా 38మంది చెత్త సేకరణ, మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. వీరిపై పర్యవేక్షణకు ఇద్దరు జవాన్లు ఉన్నారు. 10వేల జనాభాకు సుమారు 28మంది సిబ్బంది ఉండాలనేది నిబంధన. ఆలేరులో ఉన్న 20వేల జనాభాకు 56మంది పారిశుద్ధ్య సిబ్బంది కావాల్సి ఉన్నా 44మందే ఉన్నారు. సిబ్బంది కొరతపై రెండేళ్ల క్రితమే సీడీఎంఏకు మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపినా నియమించలేదు. ఫలితంగా అన్ని కాలనీల్లో చెత్త సేకరణకు ఇబ్బందులు తప్పడం లేదు. సిబ్బంది కొరత విషయాన్ని మరలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ శ్రీనివాస్ అంటున్నారు.
దోమలతో వేగలేకపోతున్నాం..
చాలా కాలనీల్లో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పక్కన చెత్త వేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు కాలనీల్లో ఫాంగింగ్ కొట్టాలి. చెత్త వేయకుండా ప్రజలకు సూచనలు చేయాలి. పందుల సమస్యను పరిష్కరించాలి. – మార్గం వెంకటేశ్, ఆలేరు

సిబ్బంది కొరతతో ఇబ్బంది