
లోతు దుక్కులతో బహుళ ప్రయోజనాలు
త్రిపురారం: వానాకాలం సాగులో భాగంగా తొలకరి వర్షాలు కురిసిన తర్వాత రైతులు దుక్కులు దున్నుకోవడం మొదలుపెడతారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో మాత్రం తొలకరి తర్వాత కాస్త ఆలస్యంగా దుక్కులు దున్ని విత్తనాలు పెడతారు. అయితే లోతు దుక్కులు దున్నుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచిస్తున్నారు.
ఫ తొలకరి వర్షాలు కురిసిన తర్వాత ట్రాక్టర్ ఫ్లవ్, రోటావేటర్ల ద్వారా పొలాన్ని దున్నుకోవచ్చు.
ఫ లోతు దుక్కులు దున్నడం వలన పొలంలో కలుపు మొక్కలు పెకలించబడతాయి. దీంతో పంటల సాగులో కలుపు సమస్య తగ్గుతుంది.
ఫ భూమి లోపలి గట్టి పొరలు పగలడం వల్ల మొక్కల వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని వెళ్తాయి. వేరు వ్యవస్థ నేలలోకి బాగా విస్తరించడం వల్ల మొక్కల ఎదుగుదలకు కావాల్సిన తేమ, పోషకాలు అందుతాయి.
ఫ పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను అభివృద్ధి పరుచుటకు లోతు దుక్కులు తోడ్పడతాయి.
ఫ పంటలకు ఆశించే శిలీంధ్రాలు సైతం లోతు దుక్కులతో ఎండ తాకిడికి చనిపోతాయి.
ఫ వివిధ పంటల్లో వచ్చే ఎండు తెగులు అదుపులో ఉంటుంది.
ఫ సరైన సమయంలో దుక్కులు దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి ఇంకి తేమ శాతం వృద్ధి చెందుతుంది.
ఫ దీంతో నేల గుల్లబారి విత్తనం నాటేందుకు అనుకూలంగా మారుతుంది. తద్వారా మొలక శాతం పెరుగుతుంది.
ఫ అంతేకాకుండా పంట మొదళ్లు, ఆకులు, చెత్త నేలలో కలిసిపోయి సేంద్రియ పదార్థంగా మారి నేల సారవంతంగా మారుతుంది.
ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు

లోతు దుక్కులతో బహుళ ప్రయోజనాలు

లోతు దుక్కులతో బహుళ ప్రయోజనాలు