
దేశ సేవలో భాగస్వాములు కావాలి
బొమ్మలరామారం : యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్‌లో గల హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు. మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడంతో పాటు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అధిరోహించాలన్నారు. ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు ఆర్మీ వెటరన్ ప్రశాంత్ హల్గేరి, హైదరాబాద్ ఎన్‌సీసీ గ్రూప్ మాజీ కమాండర్లు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కొరె రాజ్‌కుమార్, డైరెక్టర్ నవ్యశ్రీ, చీఫ్ మెంటార్ ఆర్.కె.రావు, ప్రిన్సిపాల్ అంజయ్య, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.
ఫ సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ