
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కనగల్: బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. అతడి కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ ఘటన కనగల్ మండలం బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామ స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పల్లెబోయిన సత్తయ్య(43) రెండో కుమార్తె కావ్య బుధవారం సూర్యాపేటలో పరీక్ష రాసి రాత్రి 7గంటల సమయంలో కనగల్ బస్టాండ్‌కు వచ్చింది. ఆమెను ఆమెను సత్తయ్య బైక్‌పై ఎక్కించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా.. కుమ్మరిగూడెం గ్రామ స్టేజీ వద్ద చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన వంగూరి బిక్షం వేగంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్తయ్య బైక్ పైనుంచి కిందపడగా అతడిపై మీద నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వెనుక కూర్చున్న కావ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సత్తయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం సత్తయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫ అతడి కుమార్తెకు గాయాలు