
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
కోదాడరూరల్: కోదాడ వద్ద జరిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. మరో హెడ్ కానిస్టేబుల్, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబా ద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. ఏపీలోని కోనసీమ జిల్లా అలమూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ముద్దాల అశోక్(43), అదే స్టేషన్‌లో ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యస్వామితో పాటు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుంకర బ్లెసీన్ జీవన్(31) కలిసి గంజాయి కేసులో నిందితులను పట్టుకునేందుకు ఎర్టిగా కారులో డ్రైవర్ రమేష్‌తో కలిసి బుధవారం రాత్రి 10గంటల సమయంలో హైదరాబా ద్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో డ్రైవర్‌కు నిద్రవస్తుందని చెప్పడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ వైపు గంటన్నరపాటు కారు పక్కకు ఆపి నిద్రించారు.
బయల్దేరిన 10 నిమిషాలకే..
కొద్దిసేపటి తర్వాత వీరు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరగా.. ఆ తర్వాత పది నిమిషాలకే కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్‌లో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ అశోక్, కానిస్టేబుల్ బ్లెస్లీన్ జీవన్ అక్కడికక్కడే మృతిచెందారు. హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి, డ్రైవర్ రమేష్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కారులో ఇరుక్కుపోయిన ఎస్‌ఐ మృతదేహం
లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగంలో కూర్చున్న ఎస్‌ఐ మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. కోదాడ పోలీసులు కారు భాగాలను తొలగించి అతికష్టం మీద ఎస్‌ఐ మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్‌ఐ అశోక్‌ది ఏపీలోని నరసాపురం అని, 2009 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడని, త్వరలోనే సీఐ ప్రమోషన్ రానుందని ఘటనా స్థలానికి వచ్చిన ఆయన స్నేహితులు తెలిపారు. అశోక్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కానిస్టేబుల్ బ్లెసీన్ జీవన్ అవివాహితుడు. ఈ ఘటన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. అయితే పోలీసులు లారీని పట్టుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
నివాళులర్పించిన కోనసీమ
అడిషనల్ ఎస్పీ, కోదాడ డీఎస్పీ
కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మృతదేహాలకు కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను ఏపీ పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు.
ఫ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిచెందిన
ఎస్‌ఐ, కానిస్టేబుల్ దుర్మరణం
ఫ మరో హెడ్ కానిస్టేబుల్,
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఫ కేసు విచారణ నిమిత్తం కోనసీమ జిల్లా అలమూరు స్టేషన్ నుంచి
హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం
ఫ సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్‌రోడ్ వద్ద ఘటన

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు