
నేడు ఎంజీయూలో పరికరాల ప్రదర్శన
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆవిష్కరించిన పరికరాలను శుక్రవారం యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ప్రదర్శించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు. గురువారం వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హస్సేన్ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రవి, రేఖ, జయంతి పాల్గొన్నారు.