
టెక్స్‌టైల్ పార్కులో చోరీ
ఫ గార్మెంటరీ షెడ్‌లో 35 కుట్టుమిషన్లు
ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని టెక్స్‌టైల్ పార్కులోని ఓ గార్మెంటరీ షెడ్‌లో గురువారం కుట్టు మిషన్లు చోరీకి గురయ్యాయి. వివరాలు.. చోడవరపు చిట్టిబాబు కరోనా వరకు టెక్స్‌టైల్ పార్కులో గార్మెంటరీ షెడ్ నిర్వహించాడు. కరోనా కాలంలో షెడ్‌ను మూసివేశాడు. ఇటీవల తిరిగి గార్మెంటరీ షెడ్‌ను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వారానికి ఒకసారి వచ్చి షెడ్‌ను చూసుకుని వెళ్తుంటాడు. వారం క్రితం గార్మెంటరీ షెడ్‌లోని ఉన్న బట్టలను తీసుకుని వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూడగా అందులో ఉన్న 35 కుట్టు మిషన్లు కనిపించలేదు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఒక్కో కుట్టుమిషన్ విలువ రూ.35వేలు ఉంటుందని నిర్వాహకుడు చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. నాలుగు నెలల క్రితం టెక్స్‌టైల్ పార్కులోనే వేరొక గార్మెంటరీ షెడ్ వద్ద ఇనుప స్తంభాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.