
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
యాదగిరిగుట్ట: ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమ యాత్ర బుధవారం యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని పోస్టు కార్డులో రాసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలనే న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చానలని ప్రధానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్, గౌరవ అధ్యక్షుడు భట్టు రాంచంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేష్, బత్తిని సుమన్, మచ్చ కుమార్ తదితరులున్నారు.
ఫ ప్రధానికి పోస్టు కార్డు రాసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య