
● పత్తి రైతు కష్టాలు
ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన రైతు తాళ్లపల్లి నర్సయ్యగౌడ్ ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పత్తి విత్తనాలకు,
దున్నకానికి, కలుపుతీతకు, గుంటుక తోలినందుకు గాను రూ.50వేల వరకు పెట్టుబడి వచ్చింది.
వర్షాలు ముఖం చాటేయడంతో మొలకెత్తిన పత్తి మొక్కలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో సోమవారం నర్సయ్యగౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బక్కెట్లు, బిందెల సహాయంతో పత్తి
మొక్కలకు నీళ్లు పోసి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. – ఆత్మకూరు(ఎం)