
పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి
బాగుబడి
బోరు మోటార్ల వైర్లు చోరీ
మిర్యాలగూడ టౌన్: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల వైర్లను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి మిర్యాలగూడ మండలం బోట్యానాయక్‌తండా పరిధిలో జరిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. బోట్యానాయక్‌తండాకు చెందిన రైతు, మాజీ సర్పంచ్ సాగర్‌నాయక్ శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో తన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తుండగా.. తన బోరు మోటారు వద్ద లైట్ వెలుగుతుడటం గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా గుర్తుతెలియని వ్యక్తి బోరు మోటారు వైరు చోరీ చేస్తూ కనిపించాడు. దీంతో సాగర్‌నాయక్ అతడిని నిలదీయగా ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. అనంతరం సాగర్‌నాయక్ బోరు మోటారు వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్స్‌లో ఫ్యూజు తొలగించడంతో పాటు మోటారు వైరును చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈవిధంగా తండా పరిధిలోని 30మంది రైతుల వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల వైర్లు చోరీకి గురవ్వడంతో ఆదివారం బాధిత రైతులంతా కలిసి మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి వదిలి వేసిన వెళ్లిన ద్విచక్ర వాహన్నాఇ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు.
చిట్టీల పేరుతో మోసం
ఫ కోటిన్నర రూపాయలతో
ఉడాయించిన వ్యక్తి
ఫ పోలీసులకు ఫిర్యాదు చేసిన
40మందికి పైగా బాధితులు
మిర్యాలగూడ అర్బన్: అందరితో పరిచయాలు ఏర్పచుకుని, నమ్మకంగా ఉంటూ చిట్టీలు కట్టించుకున్న వ్యక్తి సుమారు కోటిన్నర రూపాయలతో ఉడాయించాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాంతినగర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి కాలనీవాసులను నమ్మించి 40మందితో చిట్టీలు కట్టించుకున్నాడు. మొదట్లో చిట్టీ డబ్బులు బాగానే ఇచ్చిన ఆయన.. కొద్దిరోజులుగా చీటీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో చిట్టీలు పాడిన వారు అతడి ఇంటి వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వారిని వాకబు చేశారు. సదరు వ్యక్తి కొద్దిరోజులుగా కనిపించడంలేదని చుట్టుపక్కల వారు తెలపడంతో.. అతడి ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మిర్యాలగూడ టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. సుమారు 40మందికి పైగా బాధితుల వద్ద కోటిన్నర రూపాయల వరకు వసూలు చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమనర్సయ్య పేర్కొన్నారు.
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా పూజల్లో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్‌రావు, కాసబోయిన సత్యనారాయణ, యాదగిరి, మణికంఠ, గిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, మోనూపాండే, శ్రీరాంపాండే తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం రాత్రి వలిగొండ మండలం పులిగిళ్లలో సీపీఎం మాజీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వేముల మహేందర్ నాల్గవ వర్ధంతి కార్యక్రమానికి జాన్ వెస్లీ హాజరై మహేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. సీపీఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈవిధంగా ఉచిత విద్య, వైద్యం అందించగలరా అని ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలు అప్పు చేసి విద్య, వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు పెద్దఎత్తున సహకరిస్తున్నాయని ఆరోపించారు. మహేందర్ ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండీ జహంగీర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, గణపతిరెడ్డి, నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, వాకిటి వెంకటరెడ్డి, తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం, కళ్లెం సుదర్శన్రెడ్డి, దొడ్డి భిక్షపతి, వేముల నాగరాజు, మారబోయిన నరసింహ, బుగ్గ అయిలయ్య, బుగ్గ చంద్రమౌళి, పైళ్ల వీరారెడ్డి, వడ్డమాని వెంకటయ్య, వడ్డెమాని మధు, బుగ్గ ఉదయ్, వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై అడ్డంగా పడిన కంటైనర్
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి