
ఐదు దశాబ్దాల తర్వాత ఆత్మీయ కలయిక
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో 1969లో హెచ్‌ఎస్‌సీ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. 56 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడిపారు. ఆనాడు తమకు చదవు చెప్పిన గురువులు ఒంటెద్దు వెంకట్‌రెడ్డి, ఎన్. సత్యనారాయణను ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, రిటైర్డ్ టీచర్ గుండా రమేష్, పూర్వ విద్యార్థులు ప్రభాకరాచారి, వెంపటి వెంకన్న, అంజని, శ్రీనివాసరావు జయాకర్, వి. సూర్యనారాయణ, భాస్కర్, సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
41 ఏళ్ల తర్వాత..
గరిడేపల్లి: గరిడేపల్లి మండల పరిధిలోని కల్మలచెరువు జెడ్పీహెచ్‌ఎస్‌లో 1982–83 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 41ఏళ్ల తర్వాత ఒకచోట చేరి వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మూలగుండ్ల సీతారాంరెడ్డి, ఈగ శ్రీనివాసరావు, కృష్ణ, ఒంటెద్దు వెంకట్‌రెడ్డి, బండారు పిచ్చయ్య, నలబోలు సైదిరెడ్డి, ధనమ్మ, అలుగుబెల్లి సైదిరెడ్డి, గుమ్మిత నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐదు దశాబ్దాల తర్వాత ఆత్మీయ కలయిక