
ప్రభాకర్‌రెడ్డి ఎంతో ప్రతిభావంతుడు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లాకు చెందిన దివంగత నటుడు, దర్శక–నిర్మాత డాక్టర్ ఎం. ప్రభాకర్‌రెడ్డి ఎంతో ప్రతిభావంతుడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రభాకర్‌రెడ్డి సినీ జీవితంపై నల్లగొండ ఫిలిం సొసైటీ సెక్రటరీ పున్నమి అంజయ్య రచించిన పుస్తకాన్ని ఆదివారం గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసిన ఎం. ప్రభాకర్‌రెడ్డికి తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన గౌరవం దక్కలేదని అన్నారు. ప్రభాకర్‌రెడ్డి సినీ జీవితం గురించి పుస్తకం వెలువరించడం అభినందనీయమన్నారు. పుస్తక రచయిత పున్నమి అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన దివంగత నటులు కత్తి కాంతారావు, ఎం. ప్రభాకర్‌రెడ్డిలను గుర్తుచేసుకోకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కత్తి కాంతారావు, ఎం. ప్రభాకర్‌రెడ్డి, హాస్యనటుడు వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి, 500 గజాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ సభ్యులు ఫసీ, విద్యాసాగర్, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి యాదగిరిరెడ్డి, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సభ్యులు వంగూరు భాస్కర్, తేజస్విని, సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు పెందోట సోము, ప్రముఖ కవి రచయిత డాక్టర్ సాగర్ల సత్తయ్య, ఉనికి సంస్థ అధ్యక్షుడు బండారు శంకర్, విశ్వకర్మ సేవా సమితి కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి