
ఫ బాతులే జీవనాధారం
భూదాన్‌పోచంపలి: భూదాన్‌పోచంపల్లి మండలంలోని మూసీ పరీవాహక గ్రామాల్లో ఎక్కడ చూసినా బాతులు సందడి చేస్తున్నాయి. ప్రతిఏటా వరికోతలు పూర్తవ్వగానే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల నుంచి పదుల కొద్ది కుటుంబాలు బాతు పిల్లలను తీసుకొని భూదాన్‌పోచంపల్లి మండలానికి వస్తుంటారు. మూసీ పరీవాహకంలోని కాలువలు, పొలాలలో బాతులను మేపుతూ వాటిని పెద్దచేసి గుడ్లు పెట్టే దశకు పెంచుతారు. రెండు నెలల పాటు ఇక్కడే ఉండి బాతు గుడ్లను సేకరించి మధ్యవర్తుల ద్వారా గుడ్లను ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.