
నృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నిత్యారాధనలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి మేల్కొలుపులో భాగంగా ప్రభాతవేళ సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తుకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను మాడవీధిలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.