
సూర్య, చంద్ర ప్రభలపై మెరిసిన శ్రీవారు
ద్వారకాతిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ దేవదేవుడు సూర్య, చంద్ర ప్రభలపై మెరవగా.. కనులారా వీక్షించిన భక్తజనులు పులకించారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా పంచాయుధాలను ధరించి, నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారికి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. ఆ తరువాత గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించిన భక్తులకు సూర్యదేవుడి అనుగ్రహంతో సకల విద్యా, ఆరోగ్య, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. రాత్రి ఉభయ దేవేరులతో శ్రీవారు చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీదుల్లో ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవలు, చిరుగాలుల నడుమ చల్లనయ్య విశేష పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఆలయ ముఖ మండపంలో శ్రీరామ అలంకారణలో దర్శనమిచ్చిన శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు..
ఉదయం 7 గంటల నుంచి – హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ, భజన కార్యక్రమాలు
● 8 గంటల నుంచి – భక్తిరంజని
● 9 గంటల నుంచి –
కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● సాయంత్రం 4 గంటల నుంచి –
నాదస్వర కచేరి
● 5 గంటల నుండి –
కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● 6 గంటల నుంచి – ప్రవచనాలు
● రాత్రి 7 గంటల నుంచి – ఎదుర్కోలు ఉత్సవం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● 8.30 గంటల నుంచి –
వెండి శేషవాహనంపై తిరువీధి సేవ
● 9 గంటల నుంచి –
మోహినీ భస్మాసుర నాటకం
● శ్రీవారి ప్రత్యేక అలంకారం : మురళీకృష్ణ
చిన్ని కృష్ణుడితో నృత్య ప్రదర్శనలు
పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ
ద్వారకాతిరుమల: శ్రీవారికి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించింది. ఉదయం అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ టీటీడీ అధికారి పట్టువస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి చేతుల మీదుగా అర్చకులకు అందజేశారు.
శ్రీరామ అలంకారంలో దర్శనం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సూర్య, చంద్ర ప్రభలపై మెరిసిన శ్రీవారు

సూర్య, చంద్ర ప్రభలపై మెరిసిన శ్రీవారు

సూర్య, చంద్ర ప్రభలపై మెరిసిన శ్రీవారు

సూర్య, చంద్ర ప్రభలపై మెరిసిన శ్రీవారు