
అప్పులతో ఇబ్బందులు
గతంలో మా కుటుంబానికి మూడు పథకాల కింద ఏడాదికి రూ.50 వేల వరకూ వచ్చేవి. వాటితో అప్పులు తీర్చడంతో పాటు కొంత పొదుపు చేసుకునే వాళ్లం. ఇంట్లో అవసరమైన సామగ్రిని నెలవారీ వాయిదా పద్ధతిలో తీసుకుని పథకం డబ్బులతో చెల్లించేవాళ్లం. ఇప్పుడు పొదుపు మాట అటుంచి చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బందులు పడుతున్నాం. – గొంతిన ఝాన్సీలక్ష్మి, గృహిణి
అవస్థలు పడుతున్నాం
కుటుంబ అవసరాల కోసం గతంలో లేదనకుండా అప్పు ఇచ్చేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధితో అప్పులు తీర్చేవాళ్లం. ఇప్పుడు పథకాలు అమలు చేయకపోవడంతో మాకు ఆదాయం వచ్చే దారి లేదని గ్రహించి అప్పులు ఇచ్చేవాళ్లు నిరాకరిస్తున్నారు. అవసరానికి అప్పు పుట్టక అవస్థలు పడుతున్నాం.
– పోలిశెట్టి ఈశ్వరి, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు
నమ్మి మోసపోయాం
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయాం. మాలాంటి మహిళలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలోని మహిళల ఆవేదనను గ్రహించి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తారని ఆశిస్తున్నాం.
– కె.కనకదుర్గ, చిగురుకోట, ముదినేపల్లి మండలం
పథకాలన్నీ ఇవ్వాలి
గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మరలా ఇప్పుడు కూడా ఇచ్చేలా చూడాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన పథకాలు పేదలకు ఎంతో వెసులుబాటు కలిగించేవి. అవి నిలిపివేయడంతో చాలా మంది పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి పథకాలన్నీ ప్రవేశపెట్టాలి.
– నల్గొండ నాంచారమ్మ, మండవల్లి
●

అప్పులతో ఇబ్బందులు

అప్పులతో ఇబ్బందులు

అప్పులతో ఇబ్బందులు