ఉండి: వృత్తి శిక్షణ ఉపాధి అవకాశాలకు అండగా ఉంటుందని అధికారులు అన్నారు. ఆదివారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐలో పీఎం విశ్వకర్మ యోజనపై ఒక్కరోజు సద స్సు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా హస్తకళలు, టైలరింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 180 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ మంగపతి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పలత, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్రప్రసాద్, సీఎస్‌సీ మే నేజర్ రాజీవ్, డీఎల్‌పీఓ బాలాజీ, ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.