లిఫ్ట్‌ లేక.. మెట్లు ఎక్కలేక | - | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ లేక.. మెట్లు ఎక్కలేక

Jul 5 2025 5:52 AM | Updated on Jul 5 2025 5:52 AM

లిఫ్ట్‌ లేక.. మెట్లు ఎక్కలేక

లిఫ్ట్‌ లేక.. మెట్లు ఎక్కలేక

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లోని మొదటి, రెండో అంతస్తుల్లోకి వెళ్లేందుకు వృద్ధులు, వికలాంగులకు లిఫ్టే ప్రధాన ఆధారం. కొద్దిరోజుల క్రితం కలెక్టరేట్‌ సమీపంలోని ఒక లిఫ్ట్‌ను అధికారులు నిలిపివేశారు. తాజాగా, కలెక్టరేట్‌లో ఉన్న రెండో లిఫ్ట్‌ కూడా శుక్రవారం నుంచి పనిచేయలేదు. దీంతో పై అంతస్తులకు వెళ్లేందుకు వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు ఎర్కొన్నారు.

పనిచేయని లిఫ్ట్‌లు

ఆసరా ఫింఛన్లు, సర్వీస్‌ ఫించన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్‌ వస్తుంటారు. ఆసరా ఫింఛన్‌కు సంబంధించిన డీఆర్‌డీఏ రెండో అంతస్తులో, సర్వీస్‌ పెన్షన్లకు సంబంధించిన ట్రెజరీ కార్యాలయం మొదటి అంతస్తులో ఉంది. ప్రస్తుతం రేషన్‌ కార్డుల దరఖాస్తుల నిమిత్తం మొదటి అంతస్తులో ఉన్న పౌర సరఫరాల కార్యాలయానికి జనం భారీగా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు లిఫ్టులు పనిచేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా లిఫ్ట్‌లు ఆపేశారా లేక ఏమైన సాంకేతిక సమస్యలు తలెత్తిందా అన్నది తెలియాల్సి ఉంది. లిఫ్ట్‌ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

పింఛన్‌ కోసం వచ్చి.. పైకి ఎక్కలేకపోయా :

రామక్క, సర్వీస్‌ పెన్షనర్‌

నా వయస్సు 88 సంవత్సరాలు. కాకతీయ యూనివర్సిటీ ప్రాంతం నుంచి వచ్చాను. నా భర్తకు సంబంధించిన సర్వీస్‌ పెన్షన్‌ నాకు వచ్చేది. రెండు నెలలుగా పింఛన్‌ రావడం లేదు. అధికారులను అడిగితే నేనే స్వయంగా వచ్చి లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని చెప్పారు. దాంతో నేనే ట్రెజరీ కార్యాలయానికి నా కూతురును తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌ సౌకర్యం లేదు. వీల్‌ చైర్‌లో పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయాలో దిక్కుతోచక పొద్దటి నుంచి ఎదురు చూస్తున్నాం. తెలిసిన వారి ద్వారా ట్రెజరీ కార్యాలయానికి కబురు చేశాం. అధికారులు వచ్చి చూస్తామని చెప్పారు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్నా వారు రాలేదు.

హనుమకొండ కలెక్టరేట్‌లో

పనిచేయని లిఫ్ట్‌లు

అవస్థలు ఎదుర్కొంటున్న

వృద్ధులు, వికలాంగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement