
బాల్య వివాహాలను అరికట్టాలి
ధర్మసాగర్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల సమాఖ్య సంఘాల మహిళా సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ మూడు ముళ్లతో బాలికల భవిష్యత్‌ను నాశనం చేయొద్దని హెచ్చరించారు. చదువు, క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో వారు రాణించేందుకు ప్రోత్సాహం అందించాలని కోరారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం నేరమని అన్నారు. అందుకు సహకరించిన వారు శిక్షార్హులని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంఈఓ రాంధన్, హనుమకొండ సీడీపీఓ విశ్వజ, జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, సఖి వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, ఏపీఏం అనిత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఝాన్సీ, జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ కల్యాణి, ఎస్సై షైక్ జానీపాషా పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే