
చెత్త సేకరణ, తరలింపులో నిర్లక్ష్యం తగదు
వరంగల్ అర్బన్: ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, ఏదైనా వాహనం మరమ్మతుకు గురైతే ప్రత్యామ్నాయంగా మరొకటి ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం మాత్రం చేయొద్దని అధికారులను గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. ఈ నెల 2, 3వ తేదీల్లో సాక్షి దినపత్రికలో పారిశుద్ధ్యంపై వార్త కథనాలు ప్రచురితమయ్యారు. దాంతో స్పందించిన కమిషనర్.. వరంగల్ పోతననగర్‌లోని చెత్త సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఆవరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఏఈలు సంతోష్ కుమార్, ఫణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యాంరాజ్ పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్

చెత్త సేకరణ, తరలింపులో నిర్లక్ష్యం తగదు