వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 5 2025 5:50 AM | Updated on Jul 5 2025 5:50 AM

వరంగల

వరంగల్‌

శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025
జీవనాధారాన్ని కోల్పోయారు..

కమ్యూనిజం ఐక్యం అనివార్యం

కమ్యూనిజం భావజాల శక్తులు ఐక్యం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

8లోu

హన్మకొండ:

విద్యుత్‌శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వీరు టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఆదరణకు నోచుకోవడం లేదు. వీరికి ఎలాంటి సర్వీస్‌ రూల్స్‌ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యంనుంచి అందే సహాయం కూడా లేదు. వినియోగదారులకు విద్యుత్‌ సంబంద సమస్యలు తలెత్తితే ముందుగా వీరినే సంప్రదిస్తారు. వీరి దృష్టికే సమస్యలు వివరించి బాగు చేయించుకుంటారు. ఇంతటీ కీలక భూమిక పోషిస్తున్న వీరికి ఆర్థిక భరోసా అందడం లేదు.

ఆర్టిజన్‌లుగా గుర్తించని టీజీ ఎన్పీడీసీఎల్‌

రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను 2016లో విద్యుత్‌ సంస్థల్లోకి ఆర్టిజన్‌లుగా అబ్జర్వ్‌ చేసుకున్న క్రమంలో తెలంగాణ సౌథర్న్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌)లో పనిచేస్తున్న కట్టర్లను (ఇక్కడ అన్‌మ్యాన్‌ వర్కర్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌లను అక్కడ కట్టర్లుగా పిలిచేవారు) ఆర్టిజన్‌లుగా తీసుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌లో మాత్రం అప్పటి యాజమాన్యం అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌లను ఆర్టిజన్‌లుగా గుర్తించలేదు. దీంతో వీరు ప్రమాదవశాత్తు మృతిచెందితే వినియోగదారులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లుగానే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై గాయాలపాలైతే చికిత్స ఖర్చులు మాత్రం యాజమాన్యం భరిస్తుంది. కానీ, ఇది సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తుండడంతో చలించిన టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌లకు బీమా సౌకర్యం కల్పించారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 1,388 మంది అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి గత నెలనుంచి బీమా సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు 1300 మందికి బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌లను రెండు విభాగాలుగా విభజించారు. ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.20 వేల వేతనం, ఐటీఐ అర్హత లేని వారికి నెలకు రూ.17 వేల వేతనం అందిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ అర్హత కలిగిన అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌కు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఐటీఐ అర్హత లేని వారికి రూ.17 లక్షల పరిహారం అందేలా బీమా సౌకర్యం కల్పించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ ద్వారా వీరికి బీమా చేయించారు. ఇటీవల మహబూబాబాద్‌ జిల్లాలో మృతిచెందిన అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌కు ఈ బీమా వర్తించే అవకాశముందని విద్యుత్‌ అధికార వర్గాలు తెలిపాయి.

నేషనల్‌ మీట్‌లోనూ సత్తా చాటాలి

జోనల్‌ డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసులు నేషనల్‌ మీట్‌లో సత్తా చాటాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు.

– 8లోu

ఇటీవల బీమా సౌకర్యం..

న్యూస్‌రీల్‌

వరంగల్‌1
1/1

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement