
ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలి
హన్మకొండ అర్బన్: ఎన్నికల విధులు, నియమ నిబంధనలపై బూత్ లెవల్ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని హనుమకొండ ఆర్డీఓ రమేశ్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్‌లో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ తహసీల్దార్ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ రమేష్ మాట్లాడుతూ ఓట్ల నమోదు కోసం, తొలగింపు, బదిలీ, మార్పు, చేర్పులకు సంబంఽధించి వినియోగించే ఫారాలపై బీఎల్‌ఓలకు అవగాహన ఉండాలన్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చే నూతన మార్పులను తెలుసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఓటర్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో నమోదు నిరంతర ప్రక్రియ అన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా బీఎల్‌ఓలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు దశరథ రామ్‌రెడ్డి, శరత్‌కుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ ఆర్డీఓ రమేశ్