
‘నిట్’ ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం
ఇంపాక్ట్–99 స్కాలర్‌షిప్‌నకు శ్రీకారం
కాజీపేట అర్బన్ : ‘నిట్ వరంగల్ మాకు ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం’ అంటూ అల్యూమ్ని 1999వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమకు విద్యనందించిన ఇనిస్టిట్యూట్ రుణం తీర్చుకునే సంకల్పంతో ఇంపాక్ట్ (ఇన్‌స్పైరింగ్ మీనింగ్‌ఫుల్ ప్రోగ్రెస్ అండ్ అల్యూమ్ని కంట్రీబ్యూషన్ టు గెదర్)–99 పేరిట స్కాలర్‌షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆ కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆవిష్కరించి మాట్లాడారు. ఇక్కడ విద్యనభ్యసించిన 1999 బీటెక్ విద్యార్థులు నిట్‌లో ప్రస్తుతం చదువుతున్న 2025–26 బ్యాచ్ సెకండియర్ నుంచి ఫోర్త్ ఇయర్ విద్యార్థులతోపాటు ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ప్రతిభావంతులైన పిల్లలకు చేయూతనందించేందుకు ఇంపాక్ట్–99 స్కాలర్‌షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ల్యాప్‌టాప్, టెక్నికల్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌లో ఇంపాక్ట్–99 తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ అల్యూమ్ని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, సెక్రటరీ రమ, వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్ పులి రవికుమార్, కిరణ్‌కుమార్, శైలజ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.