
10లోగా మార్కెట్ ఫీజు బకాయిలు చెల్లించాలి
● మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్
వరంగల్ చౌరస్తా: వ్యాపారులు, పండ్లు, కూరగాయ ల, అద్దె బకాయిదారులు మార్కెట్ ఫీజును ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలని వరంగల్ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లిస్తేనే రైతులకు, ఆయా వర్గాలకు మెరుగైన వసతులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం కూరగాయల వర్తక సంఘం కలిసి జేడీకి పుష్పగుచ్ఛం అందించింది. కార్యక్రమంలో ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మావతి, కార్యదర్శి గుగులోత్ రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.