
చెత్తను తొలగించాలి
నర్సంపేట రూరల్: గ్రామంలో చెత్తాచెదారాన్ని వెంట వెంటనే తొలగించాలని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి కల్పన ఆదేశించారు. మండలంలోని రాజుపేట గ్రామాన్ని డీపీఓ బుధవారం తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులు, గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రికార్డుల్లో నమోదుచేసిన వాటిని వెంటనే ఆన్‌లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ రామ్మోహన్‌రావు, పంచాయతీ కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.
వైద్యాధికారులు
సమన్వయంతో పనిచేయాలి
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
బి.సాంబశివరావు
పర్వతగిరి: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి వైద్యాధికారులు, సిబ్బంది స మన్వయంలో పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు సూ చించారు. కొంకపాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్, ఐఎల్‌ఆర్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేసి మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్లు కాకుండా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ అందించా లని కోరారు. ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని, సమయపాలన పాటించాలని, హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని పేర్కొన్నా రు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమైనందున మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, పైలేరియా, మెదడువాపు తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ యాక్షన్ టీంలను సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసుకొని వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్న వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయంతో తగిన పరీక్షలు, చికిత్స తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సీసీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉగ్రామాత,
శివదూతీమాతగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు అమ్మవారిని ఉగ్రామాత, శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రామాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని శివదూతీమాతగా అలంకరించి పూజలు జరిపా రు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాండ్ల స్రవంతి, అనంతుల శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చెత్తను తొలగించాలి

చెత్తను తొలగించాలి