
రైతులు నీటిని వృథా చేయొద్దు
ఖానాపురం: పాకాల ఆయకట్టు పరిధిలోని రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. మండలంలోని పాకాల సరస్సు నీటిని ఆయన విడుదల చేశారు. ముందుగా ఆంజనేయస్వామి, కట్టమైసమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పాకాల కాల్వల మరమ్మతుల కోసం డీపీఆర్‌లు తయారుచేసి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లీకేజీలు ఇప్పటికే అరికట్టామని, వచ్చే సీజన్ నాటికి 80 శాతం నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్తాస్ జానయ్య మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 1.20 లక్షల మంది రైతులకు సూచనలు చేసినట్లు తెలిపారు. రెండో పంట సాగులో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు సాగుచేసి అధిక లాభాలు గడించాలన్నారు. ఈఈ సుదర్శన్‌రావు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, తహసీల్దార్ రమేశ్, డీఈ రమేశ్, వెంకటప్రసాదరావు, ముస్తఫా, సాగర్‌రావు, ఎల్లాగౌడ్, విద్యాసాగర్‌రావు, మోహన్‌రెడ్డి, మురళి, ఉపేందర్, వేణుగోపాల్‌రావు, రవి పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
పాకాల సరస్సు నీటి విడుదల