విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో భద్రకాళి | - | Sakshi
Sakshi News home page

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో భద్రకాళి

Jul 2 2025 5:01 AM | Updated on Jul 2 2025 5:01 AM

విప్ర

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో భద్రకాళి

హన్మకొండ కల్చరల్‌ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆరో రోజు అమ్మవారిని విప్రచిత్తా, మహావజ్రేశ్వరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాదాల వితరణ చేశారు. అర్చకులు భద్రకాళి శేషు, ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అంతర్జాతీయ సదస్సులో

సుజాత పరిశోధన పత్రం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ కో ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ లైబ్రరీ అసిస్టెంట్‌ డాక్టర్‌ సుజాత శ్రీలంకలోని పెరదేనియా సెంట్రల్‌ యూనివర్సిటీలో గత నెల 26, 27వ తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. తోపుడు బండి (ట్రాలీకార్ట్‌) అండ్‌ ఇట్స్‌ సర్వీసెస్‌ ఇన్‌ తెలంగాణ, ఇండియా అనే అంశంపై పరిశోధనపత్రం సమర్పించారు. ఇది ఉత్తమ పత్రంగా ఎంపికై నట్లు ఆమె మంగళవారం ఇక్కడ తెలిపారు. క్యాంపస్‌లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణ.. సుజాతను అభినందించారు.

అరుణాచలానికి

ఆర్టీసీ ప్రత్యేక బస్సు

హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ దర్శనం విజయ భాను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌–1 డిపో సూపర్‌ లగ్జరీ బస్‌ (సర్వీస్‌ నంబర్‌ 92222) ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ నుంచి బయయల్దేరుతుందని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం 90634 07493, 77805 65971, 98663 73825, 99592 26047 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

గురుకులాల్లో అడ్మిషన్ల

టార్గెట్‌ పూర్తి చేయాలి

డీఎండబ్ల్యూఓ గౌస్‌ హైదర్‌

న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్ల లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కేఏ.గౌస్‌ హైదర్‌ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు గురుకులాల ప్రిన్సిపాళ్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పేద మైనార్టీలకు అందాల్సిన ఫలాలను వారు అందుకునేలా కృషి చేయాలని, ఇంటింటికీ తిరిగి గురుకులాల్లో అడ్మిషన్లు పొందితే కలిగే లాభాలను వివరించాలని సూచించారు. హనుమకొండ రాయపురలో బుధవారం నిర్వహించనున్న ఇంటింటి ప్రచారంలో తాను కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎండబ్ల్యూఓకు ప్రిన్సిపాళ్లు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో సూపరింటెండెంట్‌ రాజు, డాక్టర్‌ సయ్యద్‌ ఖాజా మొహిసినాబాను, ఆర్‌ఎల్సీ శ్రీనివాస్‌, ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ జె.సతీశ్‌, నీరజ, తదితరులు పాల్గొన్నారు.

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ  క్రమాల్లో భద్రకాళి1
1/3

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో భద్రకాళి

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ  క్రమాల్లో భద్రకాళి2
2/3

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో భద్రకాళి

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ  క్రమాల్లో భద్రకాళి3
3/3

విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో భద్రకాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement