
బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం
పరకాల: మల్లక్‌పేట సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని పరకాల ఆర్డీఓ కె.నారాయణ తెలిపారు. మృతదేహంతో బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు సిద్ధం కావడంతో సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్ ఆర్డీఓ నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. బాలిక మృతిపై విచారణకు పరకాలకు చేరుకున్న సోషల్ వేల్ఫేర్ జోనల్ అధికారి స్వరూపరాణి, ఆర్డీఓ నారాయణ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిర్యాదు స్వీకరించారు. బాలిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కోసం కృషి చేస్తామని తెలిపారు.
పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ
న్యాయం చేయాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు