ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
వనపర్తి: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స, సేవలు అందిస్తున్న సిబ్బందికి కలెక్టర్ తన చాంబర్‌లో ప్రశంసాపత్రాలు అందజేసి మాట్లాడారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, గంధం నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


