పత్తి రైతుకు ఊరట..
12 క్వింటాళ్ల కొనుగోలుకు సీసీఐ అనుమతి
● ఆన్‌లైన్ నమోదుకుఏఈఓలకు ఆదేశాలు
● క్వింటా ధర రూ.8,110
● ఆనందంలో రైతులు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని మొదట ప్రకటించడంతో మిగిలిన పత్తి ఎక్కడ విక్రయించాలో అర్థంగాక రైతులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది.
● జిల్లావ్యాప్తంగా 7,150 మంది రైతులు 18,452 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. ఎకరాకు 9 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగబడి వస్తుంది. ఏఓ, ఏఈఓలకు కపాస్ వెబ్‌సైట్‌లో పంట దిగుబడి వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించడంతో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల బాట పట్టారు. ప్రస్తుతం సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా పత్తికి రూ.8,110 మద్దతు ధర ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు తాము పండించిన పత్తిని చేరువలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలు 24 గంటల వ్యవధిలో కపాస్ వెబ్‌సైట్‌లో నమోదవుతాయని అధికారులు రైతులకు వివరిస్తూ పంట సాగుతో పాటు దిగుబడి వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు.
ఏదుట్ల 30
శ్రీరంగాపురం 3
పాన్‌గల్
4
చిన్నంబావి 23
పత్తి రైతుకు ఊరట..


