21న జాతీయ లోక్ అదాలత్
వనపర్తిటౌన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్స్, చెక్‌బౌన్స్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజీయే రాజ మార్గమని.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కక్షిదారులు డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని, తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదని, లోక్ అదాలత్ తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదని వివరించారు. దావా వేయడానికి కోర్టులో చెల్లించిన కోర్టు ఫీజు వాపస్ చేస్తామని పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వేతనాలు పెంచాలంటూ కార్మికుల ఆందోళన
వనపర్తి రూరల్: తమకు రూ.26 వేలు వేతనం చెల్లించాంటూ మంగళవారం మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కార్యదర్శి గంధం శ్రీను, నర్సింహ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం గంట పాటు విధులు బహిష్కరించి జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గడువు ముగిసిన ఏజెన్సీలను తక్షణమే రద్దుచేసి కొత్త టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత ఏజెన్సీలనే పొడిగించడంతో కార్మికులకు ఆర్థిక నష్టంతో పాటు పనిభారం పెరుగుతుందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి వేతనాల పెంపుపై స్పష్టత ఇవ్వాలని.. లేనిచో 5వ తేదీన చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు దర్గస్వామి, నరేందర్, కుమార్, శివ, షాబాద్, రవి, కిషోర్, వెంకటయ్య పాల్గొన్నారు.
‘వామపక్షాలతోనే గ్రామాల అభివృద్ధి’
వనపర్తి రూరల్: వామపక్షాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని.. సీపీఎం, సీపీఐ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు ఎం.రాజు అధ్యక్షతన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీపీఎం నాయకుడు ఎండీ జబ్బారు, సీపీఐ జిల్లాకార్యదర్శి విజయరాములు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల నాయకులు చర్చించుకొని గ్రామపంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ నాయకులు నిజాయతీగా ప్రజల కోసం పని చేస్తారని, బూర్జువ పార్టీలు ఎన్నికల్లో ఖర్చుపెట్టి ఎన్నికల తర్వాత విపరీతంగా సంపాదించుకుంటాయని ఆరోపించారు. ప్రజలు గ్రామాల అభివృద్ధికి కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బాలుర
వసతిగృహం తనిఖీ
మదనాపురం: స్థానిక ప్రభుత్వ బాలుర వసతిగృహాన్ని మంగళవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లికార్జున్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, నిత్యావసర సరుకుల నాణ్యత, వంటగదిని పరిశీలించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థులకు వేడి భోజనం అందించాలని సిబ్బందికి సూచించా రు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకు న్నారు. ఆయన వెంట వనపర్తి, కొత్తకోట సహా య సంక్షేమ అధికారులు శ్వేత, మల్లేశం వసతిగృహ సంక్షేమ అధికారి బెనర్జీ ఉన్నారు.
21న జాతీయ లోక్ అదాలత్
21న జాతీయ లోక్ అదాలత్


