చివరిరోజు.. నామినేషన్ల జోరు
● ముగిసిన రెండోవిడత స్వీకరణ ప్రక్రియ
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల రెండోవిడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. రాత్రి పొద్దుపోయే వరకు సమయంలోపు క్లస్టర్ కేంద్రాల్లోకి వచ్చిన వారి నామినేషన్లు స్వీకరించారు. అమరచింత మండలంలో అర్ధరాత్రి 12 దాటినా కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. మిగిలిన ఆత్మకూరు మండలంలోని 13 సర్పంచు స్థానాలకు 111 నామినేషన్లు, 118 వార్డు స్థానాలకు 308 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కొత్తకోట మండలంలోని 24 సర్పంచ్ స్థానాలకు 190, 220 వార్డు స్థానాలకు 544.. మదనాపురం మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 125, 162 వార్డు స్థానాలకు 352.. వనపర్తి మండంలోని 26 సర్పంచ్ స్థానాలకు 141, నామినేషన్లు, 230 వార్డు స్థానాలకు 455 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆత్మకూరు, అమరచింత మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సింగిల్ డిజిట్ నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఏయే గ్రామానికి ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.


