
కాంగ్రెస్‌లో కష్టపడిన వారికే పదవులు
కందనూలు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని, కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ లీడర్లకే అవకాశం ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ పార్టీలో లేని స్వేచ్ఛ కాంగ్రెస్‌లో ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం నేతలు కష్టపడితేనే వారికి పదవుల రూపంలో ప్రతిఫలం దక్కుతుందన్నారు. ఇందుకోసం పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ గల్లీలో పార్టీ కోసం కష్టపడితేనే ఢిల్లీలో అధికారం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. యువజన కాంగ్రెస్ వల్లే తాను గెలిచినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియా వారియర్లుగా యువజన కాంగ్రెస్ లీడర్లు ఎదగాలని, అందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. సోషల్ మీడియానే వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని కోరారు. గ్రామాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గె లుపొందేలా ప్రతి కార్యకర్త పాటుపడాలని కోరారు.