
‘పీఆర్సీ వెంటనే అమలు చేయాలి’
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తపస్ జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి కోరారు. గురువారం సంఘం కొత్తకోటశాఖ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాల కొత్తకోట, పాలెం, కనిమెట్ట, రామనంతపురం, నిర్వేన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు చేయించి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శి రాఘవేంద్రాచారి, అరవింద్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, రాములు, జిల్లా కార్యవర్గసభ్యులు ఈశ్వరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సరేందర్ పాల్గొన్నారు.