
ఎద్దులబండ్లతో యథేచ్ఛగా
రామన్‌పాడు, ఊకచెట్టు, చిన్న వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా
మదనాపురం: ఇసుక అక్రమ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామాల్లోని చోట మోటా రాజకీయ నాయకుల అండతో ఎద్దులబండ్ల వారితో కుమ్మకై ్క అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం వేళ వాగు నుంచి ఎద్దుల బండ్లపై ఇసుకను గ్రామాల్లోని ఓ చోటకు తరలించి అక్కడ నిల్వచేసి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లతో పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా మండలంలో ఇదే తంతుకొనసాగుతున్నా అధికారులు చూసీచూడ నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
చిన్నవాగు, ఊకచెట్టు వాగు నుంచి సైతం..
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కో ఎద్దుల బండితో ఐదు నుంచి ఆరు ట్రిప్పులు తరలిస్తున్నారు. రామన్‌పాడు నుంచేగాక చిన్నవాగు నుంచి దంతనూరు, గోవిందహళ్లి, మదనాపురం, తిర్మలాయపల్లి గ్రామాల ఎద్దుల బండ్లు, ఊకచెట్టు వాగు ఇసుకను దుప్పల్లి, కర్వెన, గోపన్‌పేట గ్రామాల వ్యాపారులు తరలిస్తున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గి పొలాల్లోని బోరుబావులు ఎండిపోతున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతున్నారు.
స్థానిక నేతల అండదండలతోనే..
గ్రామాల్లో డంపులు.. రాత్రిళ్లు ట్రాక్టర్లపై పట్టణాలకుతరలింపు
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులు
అనుమతులు లేవు..
వాగుల నుంచి ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్ల యజమానులు అనుమతులు లేకుండా ఇసుక తరలించొద్దు. ఎక్కడైనా ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తాం.
– అబ్రహం లింకన్, తహసీల్దార్

ఎద్దులబండ్లతో యథేచ్ఛగా