
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో 5 రోజుల పాటు కొనసాగే జిల్లాస్థాయి ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణను మంగళవారం జిల్లా విద్యాధికారి ఘనీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి శిక్షణకు హాజరుకావాలన్నారు. 21 రకాల వైకల్యాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించి వందశాతం సీడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థులను గుర్తించి యూడైస్‌లో నమోదు చేయించాలన్నారు. సీడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా తగిన బోధన అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్లు యుగంధర్, శేఖర్, శుభలక్ష్మి, మహానంది, డీఆర్‌పీ పాల్గొన్నారు.