
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
గోపాల్‌పేట: రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. సోమవారం మండలంలోని మున్ననూరులో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరి యా, పురుగు మందులను తగిన మోతాదులో వినియోగించాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు భూసార పరీక్షలతో కలిగే లాభాలు, పంట అవశేషాలను కాల్చడంతో కలిగే నష్టాలను వివరించారు. సాగు సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, అలాగే పంటమార్పిడి చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో పంటల సాగు, ఆయిల్‌పాం సాగు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కరుణశ్రీ, హరీశ్‌నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ..
వనపర్తి టౌన్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సోమవారం జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో 68 మంది లబ్ధిదారులకు రూ.34.03 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా మత్స్యకార సెల్ అధ్యక్షుడు నందిమళ్ల యాదయ్య, పెద్దమందడి మండల అధ్యక్షుడు సి.పెంటన్న, నారాయణ, జిల్లా సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్, పట్టణ ప్రధానకార్యదర్శి అడ్వొకేట్ బాబా, నాయకులు ఎత్తం చరణ్, రాగి వేణు, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్దుల్లా, జానంపేట నాగరాజు, అనీష్, గోవర్ధన్, గట్టు రాజు, సొప్పరి రమేష్ పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యంతో ముందుకుసాగాలి
వనపర్తి: విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా ముందుకుసాగాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు సాయి శరణ్య, శ్రీచరణ్, భార్గవి, అమూల్యశ్రీని ఎస్పీ శాలువాలతో సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరమని, పిల్లలు సంస్కారాన్ని పెంపొందించుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. విశ్వకర్మ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారోజు తిరుపతయ్య, యాదగిరి, గౌరవ అధ్యక్షులు బైరోజు చంద్రశేఖర్, సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, డా. బి.శ్యాంసుందర్, అరవింద్, ప్రకాష్, రామ్మోహన్, శ్రీనివాసాచారి, శ్రీశైలం పాల్గొన్నారు.