అమ్మా.. నీకు వందనం | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. నీకు వందనం

May 11 2025 12:30 PM | Updated on May 11 2025 12:30 PM

అమ్మా

అమ్మా.. నీకు వందనం

వనపర్తి

వాతావరణం

ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత

పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి.

వేగంగా ‘టర్ఫ్‌’ పనులు

పాలమూరు ఎండీసీఏ క్రికెట్‌ మైదానంలో

అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

వివరాలు 10లో u

సృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్‌లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్‌ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్‌లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్‌, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు.

– లక్ష్మీనారాయణ,

అదనపు కలెక్టర్‌, జోగుళాంబ గద్వాల

అమ్మ మాట.. బంగారు బాట..

తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో..

తల్లి ప్రేమ మారదు..

ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్‌నగర్‌ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్‌లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్‌నగర్‌లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్‌కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్‌పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్‌ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను.

నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్‌ డే శుభాకాంక్షలు.

– వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌, ఎస్పీ, నాగర్‌కర్నూల్‌

నేడు

మాతృ దినోత్సవం

మ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్‌గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్‌లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్‌లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్‌లో రోల్‌ మోడల్‌గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్‌ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్‌కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు.

– ఆదర్శ్‌ సురభి, కలెక్టర్‌, వనపర్తి

అమృత పదం అమ్మ

దాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ. అమృతం ఆయుష్షు పోస్తుందో.. లేదో.. తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకు అందిస్తుంది. నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే తల్లి రుణం తీర్చుకోలేం. అమ్మ మన రేపటి భవిష్యత్‌ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

– విజయేందిర, కలెక్టర్‌, మహబూబ్‌నగర్‌

తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి

అమ్మ లేకుంటే నేను లేను

సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. – సాక్షి, నాగర్‌కర్నూల్‌/పాలమూరు/ వనపర్తి/గద్వాల/జెడ్పీసెంటర్‌

తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు..

నా కెరీర్‌లో రోల్‌ మోడల్‌

అమ్మా.. నీకు వందనం 1
1/6

అమ్మా.. నీకు వందనం

అమ్మా.. నీకు వందనం 2
2/6

అమ్మా.. నీకు వందనం

అమ్మా.. నీకు వందనం 3
3/6

అమ్మా.. నీకు వందనం

అమ్మా.. నీకు వందనం 4
4/6

అమ్మా.. నీకు వందనం

అమ్మా.. నీకు వందనం 5
5/6

అమ్మా.. నీకు వందనం

అమ్మా.. నీకు వందనం 6
6/6

అమ్మా.. నీకు వందనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement