
హాకీ గుర్తింపును మరింత పెంచాలి
వనపర్తి టౌన్: హాకీలో జిల్లాకు ఉన్న పేరును మరింత పెంచాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండా విజయ్‌కుమార్ క్రీడాకారులకు సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో హాకీ వేసవి శిక్షణ శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలను ఉపయోగించి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కుమార్, ప్రధానోపాధ్యాయుడు గురురాజ్, మన్యం యాదవ్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.