
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్‌లో హోరంచ, అష్‌నాల్, ఎర్గోల, మినాస్‌పూర్ బ్లాక్‌లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్‌పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.