
చౌడేశ్వరీదేవి కరుణ ఉండాలి
గోపాల్‌పేట: చౌడేశ్వరీదేవి కరుణ ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. సోమవారం ఏదుల మండలం చెన్నారం గ్రామంలో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే నిర్వహిస్తున్న ఎద్దులు, ట్రాక్టర్లు, పొట్టేళ్ల బండ్ల పోటీలను తిలకించారు. సరదాగా కాసేపు పొటేళ్ల బండిపై ఎక్కి ప్రయాణించారు. గ్రామస్తులంతా సంతోషంగా ఉండాలని కోరారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
బండలాగుడు పోటీలు..
మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయ జాతరలో భాగంగా సోమవారం పెద్దబండలాగుడు పోటీలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పోటీలను జాతర కమిటీ సభ్యులు ప్రారంభించారు. మొత్తం ఆరు జతల ఎద్దులు పాల్గొనగా.. మొదటి స్థానంలో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్ బుల్స్ శ్రీధర్‌బాబు ఎద్దులు, రెండోస్థానంలో యాదిరెడ్డిపల్లికి చెందిన టీసీఆర్ బుల్స్, మూడోస్థానంలో పీఆర్‌పల్లికి చెందిన మోతుకపాటి వెంకటసుబ్బారెడ్డి ఎద్దులు, నాలుగో స్థానంలో చిన్నంబావి మండలం గోపాలకృష్ణకు చెందిన ఎద్దులు, ఐదోస్థానంలో నంద్యాలకు చెందిన హర్షిణి బుల్స్, ఆరోస్థానంలో ఆళ్ల మదన్‌మోహన్‌రెడ్డి ఎద్దులు నిలిచాయి. పోటీలను తిలకించేందుకు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చారు.

చౌడేశ్వరీదేవి కరుణ ఉండాలి