
సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే..
అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, బలహీనవర్గాలు, మహిళా హక్కుల సాధనకు కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫూలే జయంతి వేడుకలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని మహిళలకు సైతం విద్యనందించి మొదటిసారిగా వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, సామాజిక తత్వవేత్త, సంఘ సేవకుడన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచాయాని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, డీసీఆర్బీ సీఐ రవిపాల్, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.