
ఓటుహక్కు వినియోగించుకుంటున్న న్యాయవాదులు
వనపర్తి క్రైం: వనపర్తి న్యాయవాదుల సంఘం అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సంఘంలోని మిగతా పదవులు ఏకగ్రీవం కాగా... అధ్యక్ష పదవికి మున్నూర్ రవీందర్, మోహన్‌కుమార్‌యాదవ్ పోటీపడ్డారు. ఇరువురు రాజీ కాకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు అశోక్‌రావు, వెంకటరమణ వ్యవహరించగా.. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 198 మంది న్యాయవాదులు ఉండగా.. కొందరికి ఓటుహక్కు లేకపోవడంతో 149 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్‌కుమార్ యాదవ్‌కు 92 ఓట్లు, మున్నూర్ రవీందర్‌కు 40 ఓట్లు వచ్చాయి. 52 ఓట్ల తేడాతో మోహన్‌కుమార్‌యాదవ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 3న ఎన్నికై న కార్యవర్గం బాధ్యతలు చేపట్టనుంది.

మోహన్‌కుమార్‌యాదవ్