
మాట్లాడుతున్న పుర చైర్మన్ గట్టుయాదవ్
వనపర్తిటౌన్: పురపాలికను స్వచ్ఛంగా తీర్చిదిదేందుకు ప్రజలంతా సహకరించాలని పుర చైర్మన్ గట్టుయాదవ్ కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సన్నద్ధతలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఉత్సవాల అవగాహన సదస్సును శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాకాలనీలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారుచేయడంతో పాటు ప్లాస్టిక్ రహిత పట్టణంగా తయారు చేయాలని కోరారు. వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పుర కమిషనర్ విక్రమసింహారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీని స్వచ్ఛత లక్ష్యం వైపు నడిపించేందుకు మహిళా సంఘాల పాత్ర కీలకంగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సంఘాల్లోని ప్రతి సభ్యురాలు స్వచ్ఛతపై అవగాహన పెంచుకుంటే వనపర్తికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెగ్రిగేషన్ షెడ్లలో సేంద్రియ ఎరువు తయారుచేసి మున్సిపాలిటీ ఆదాయం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాకనాటి కృష్ణ, వెంకటేష్, శాంతి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శరవంద, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పుర చైర్మన్ గట్టుయాదవ్