
బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి తదితరులు
ఖిల్లాఘనపురం: ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి కొండల్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడిఓ విజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం 10వ తరగతి పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్న భోజనం, స్టాక్ రూంలోని సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. రెండు కేంద్రాల్లోని గదులను శుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఎంఈఓ ఉషారాణి, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. శానిటేషన్, ప్లాంటేషన్, నర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అర్హులందరూ విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవితేజ, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
కొండల్‌రావు