● ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 230మద్యం దుకాణాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్, నారాయణపేటలో కలిపి 90, నాగర్‌కర్నూల్ జిల్లాలో 67, వనపర్తి 37, జోగుళాంబ గద్వాలలో 36 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2020–21లో రూ.1852.93 కోట్ల ఆదాయం రాగా.. 2021–22లో రూ.2650.29కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈసారి ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో మార్చి 30 నాటికి రూ.2516.24 కోట్ల విక్రయాలు జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు మరో రూ.40 కోట్ల వరకు విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్లలో అత్యధిక విక్రయాలు జరిగాయి.