జిల్లాలోని పురపాలికల్లో జనాభా ప్రాతిపదికన కాకుండా వార్డుల వారీగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. వనపర్తి పురపాలికలో 33 వార్డులు ఉండగా.. మొదటి విడతలో 19 వార్డుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 13 వార్డుల్లో ప్రారంభించగా.. మిగిలిన 6 వార్డుల్లో స్థలాలను గుర్తించి పనులు చేపడుతున్నారు. మిగిలిన 16 వార్డుల్లో స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు.
● కొత్తకోట పురపాలికలో 15 వార్డులు ఉండగా.. 8 చోట్ల క్రీడా మైదానాలను ప్రారంభించారు. మిగిలిన 7 వార్డుల్లో అధికారులు స్థలాలుఉ ఎంపిక చేస్తున్నారు.
● పెబ్బేరులో 12, ఆత్మకూర్‌లో 10 వార్డులు ఉండగా.. అన్ని వార్డుల్లో పనులు పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చామని ఆయా పురపాలికల అధికారులు చెబుతున్నారు.
● అమరచింతలో క్రీడామైదానం ఏర్పాటుకు గుర్తించిన స్థలంలో శ్మశానవాటిక ఉందని గొడవ జరగడంతో అక్కడి నుంచి తాత్కాలికంగా తప్పించి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. పది వార్డులు ఉండగా.. ఏడు చోట్ల స్థలాలను గుర్తించారు.