
పోటీల్లో ఎద్దులబండ్లు
అమరచింత: శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆత్మకూర్ మండలం మూలమళ్లలో గురువారం సాయంత్రం రెండు గిరకల ఎద్దులబండ్ల పోటీలు నిర్వహించారు. మొత్తం 32 ఎద్దులబండ్లు పాల్గొనగా.. పోటీలను ఆత్మకూర్ సీఐ రత్నం ప్రారంభించారు. రాత్రి వరకు కొనసాగిన పోటీల్లో మొదటి బహుమతిని నారాయణపేట జిల్లా అనుగొండకు చెందిన రాములుగౌడ్ గెలుచుకోగా.. రూ.16 వేల నగదును సర్పంచ్ ప్రశాంతిరాజ్ అందజేశారు. రెండో బహుమతిని పడ్వాడ్ గుడిసె రంగన్న గెలుపొందగా రూ.12 వేలు, మూడో బహుమతిని కుచినెర్ల రాము గెలుపొందగా రూ.8 వేలు, నాలుగో బహుమతిని కర్నె నందిత సాధించగా రూ.ఆరు వేల నగదుతో పాటు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ బీసీసెల్ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, ఉపసర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.